Current Affairs Telugu Daily

సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్‌ ప్రయోగం 
వైమానిక దళ పోరాట శక్తిని మరింత పెంచే కీలక ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూయీజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌... తొలిసారిగా సుఖోయ్‌ యుద్ధవిమానం నుంచి దూసుకెళ్లింది. ఇది బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించింది. దీంతో భూ, సముద్ర తలాలతోపాటు గగనతలం నుంచీ ఈ శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్షిపణితో 290 కి.మీ.దూరంలోని లక్ష్యాలపై గురిపెట్టొచ్చు. ఇప్పటివరకూ సుఖోయ్‌ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో ఇదే అత్యంత బరువైనది (2.5 టన్ను).
views: 1338

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams