Current Affairs Telugu Daily

PSLV - 35 ద్వారా ఓకేసారి 8 ఉపగ్రహాలు ప్రయోగం
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఒకే ప్రయోగంలో 8 ఉపగ్రహాలను రెండు కక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అమెరికా, రష్యాల తర్వాత ఆ సామర్థ్యం సాధించిన మూడో దేశంగా అవతరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీ హరికోటలోని సతీష్ దవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం చేసిన ప్రయోగంతో ఈ చరిత్ర సృష్ఠించింది. అంతరిక్ష ప్రయోగాల వినువీధిలో భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగిరేలా చేసింది. ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్తం PSLV - 35 ఉపగ్రహ వాహక నౌకతో సోమవారం ఉదయం 9.12 గం. స్వదేశీ ఉపగ్రహాం స్కాట్‍శాట్ - 1, ఐదు విదేశీ ఉపగ్రహాలు సహా మొత్తం 8 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి రెండు వేర్వేరు ఎత్తుల్లోని సూర్యానువర్తన ద్రువకక్ష్యల్లోకి ప్రవేశ పెట్టింది. ఇస్రో 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ తరహా ప్రయోగం చేసి ఘన విజయం సాధించింది.
views: 1104

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams