Current Affairs Telugu Daily

శ్రీకాకుళం గిరిజనోద్యమ నేత కమలమ్మ మృతి
శ్రీకాకుళం గిరిజనోద్యమ నాయకురాలు, విద్యావేత్త, రచయిత, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో కీలక పాత్ర పోషించిన దిగుమర్తి  కమలమ్మ (91) 2017 నవంబర్‌ 21న తెలంగాణలోని కొత్తగూడెంలో మృతి చెందారు. ఆమె భర్త దిగుమర్తి విశ్వనాధం మూడేళ్ల క్రితమే మృతి చెందారు. వీరిద్దరూ కమ్యూనిస్టు నేత పుచ్చపల్లి సుందరయ్యతో కలసి పనిచేశారు. విశాలాంధ్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో తొలి ప్రైవేట్‌ విద్యాసంస్థలను స్థాపించారు. అప్పట్లో మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి శ్రీకాకుళం ఎప్పుడు వెళ్లినా వీరింట్లోనే బస చేసేవారు. కమలమ్మ ఉపాధ్యాయ రంగంలో రాణిస్తూ మహిళా ఉద్యమాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించారు. డిప్యూటీ డీఈవోగా పనిచేసిన కమలమ్మ సేకరించిన సుమారు 800 ప్రస్తకాలతో ఇటీవలే కొత్తగూడెం సీపీఎం కార్యాలయంలో ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. 
views: 1505



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams