Current Affairs Telugu Daily

సీయాటెల్‌ నగర డిప్యూటీ మేయర్‌గా చెన్నై యువతి
సీయాటెల్‌ నగర డిప్యూటీ మేయర్‌గా చెన్నైకి చెందిన షిపాలీ ఎంపికయ్యారు. స్థానిక రవాణా విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ప్రతిభ కనబరచడంతో అక్కడి మేయర్‌ షిపాలీని డిప్యూటీ మేయర్‌గా నియమించుకున్నారు. ఆమె చెన్నైలోని నుంగంబాక్కంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. అనంతరం స్టెల్లామేరీస్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. అన్నా వర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో బంగారు పతకాన్ని పొందారు. చెన్నై బోట్‌ క్లబ్‌లో నిర్వహించిన అనేక పడవ పోటీల్లోనూ ఆమె పాల్గొన్నారు. 2001లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.
views: 1338

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams