Current Affairs Telugu Daily

జడ్జీల వేతనా పెంపుపై కమిషన్‌ ఏర్పాటు
కింది కోర్టుల జడ్జీల వేతనాల పెంపు విషయమై సిఫార్సులు చేసేందుకు కమిషన్‌ను నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండో జాతీయ జ్యుడీషియల్‌ వేతన కమిషన్‌ ఏర్పాటునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పి.వెంకటరామరెడ్డి అధ్యక్షత వహించనుండగా, కేరళ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.బసంత్‌ సభ్యునిగా ఉంటారు. ఈ కమిషన్‌ 18 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు చేయాల్సి ఉంటుందని న్యాయశాఖ తెలిపింది. చివరిసారిగా 2010లో వేతనాల సవరణ జరిగింది. అంతకుమునుపు ఉన్న వేతనాలను మూడు రెట్లు పెంచారు. 2006 జనవరి ఒకటో తేదీ నుంచే అమలయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం జూనియర్‌ సివిల్‌ జడ్జికి రూ.45 వేలు, సీనియర్‌ సివిల్‌ జడ్జికి సుమారు రూ.80 వేలు వేతనంగా వస్తోంది.
views: 1034

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams