Current Affairs Telugu Daily

లాజిస్టిక్స్‌కు మౌలిక హోదా
లాజిస్టిక్స్‌ రంగానికి కూడా మౌలిక రంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక పార్కు, కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులు, రవాణా మొదలైనవన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. మౌలిక రంగంలో ఉపవిభాగాల  కింద రవాణాకి లాజిస్టిక్స్‌ని కూడా జోడించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల  విభాగం ఈ మేరకు సవరించిన నిబంధనపై ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
- మౌలిక రంగ హోదా లభించడంతో ఇక లాజిస్టిక్స్‌ సంస్థలు తక్కువ వడ్డీలకు దీర్ఘకాలిక రుణాలు పొందే వీలు కలుగుతుంది. దేశీయంగా ఎగుమతులకు సంబంధించి లాజిస్టిక్స్‌ వ్యయాలు  భారీగా ఉంటుండటంతో... భారతీయ ఉత్పత్తులు  అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. 
- నోటిఫికేషన్‌ ప్రకారం కనీసం రూ.50 కోట్ల పెట్టుబడి సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రా కిందకి వస్తాయి.
- కనీసం రూ. 15 కోట్ల పెట్టుబడి గల కోల్డ్‌ స్టోరేజీలు, రూ. 25 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ ఉన్న గిడ్డంగులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. 
- రహదారులు, వంతెనలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, టన్నెల్స్‌ వంటివన్నీ రవాణా, లాజిస్టిక్స్‌లోకి వస్తాయి.  

views: 1091

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams