Current Affairs Telugu Daily

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ విజేత దిమిత్రోవ్‌
పురుషుల టెన్నిస్‌ సీజన్‌ టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ చాంపియన్‌గా అవతరించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో దిమిత్రోవ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై గెలిచాడు. 1998లో అలెక్స్‌ కొరెత్యా (స్పెయిన్‌) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్‌ గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన దిమిత్రోవ్‌కు 25,49,000 డాలర్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు), రన్నరప్‌ గాఫిన్‌కు 11,58,000 డాలర్లు (రూ. 7 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
views: 1113



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams