Current Affairs Telugu Daily

కేంద్ర మాజీ మంత్రి ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ మృతి
అనారోగ్యంతో గత తొమ్మిదేళ్లుగా కోమాలో ఉన్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ(72) 2017 నవంబర్‌ 20న న్యూడిల్లీలో మృతి చెందారు. మున్షీకి భార్య దీప, కుమారుడు ఉన్నారు. ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 2008లో ఆలిండియా ఫుట్ బాల్‌ ఫెడరేషన్‌కు అధిపతిగా వ్యవహరించారు. అదేసమయంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. దేశంలో  ఫుట్‌బాల్‌ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మున్షీ ఎంతగానో కృషిచేశారు. 2004-05 కాలంలో మున్షీ కేంద్రమంత్రిగా పనిచేశారు.
views: 948

Current Affairs Telugu
e-Magazine
January-2019
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams