Current Affairs Telugu Daily

గ్రహాంతరవాసులకు సందేశం పంపిన ఖగోళ నిపుణులు 
మన సౌర మండలానికి సమీపంలోని తారా వ్యవస్థపై గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు ఓ రేడియో సందేశం పంపారు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో జీజే273గా పిలిచే ఓ నక్షత్రం ఉంది. దీనిచుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నాయి. వీటిలో జీజే273బీగా పిలిచే ఓ గ్రహం అవాసయోగ్య పరిధిలో ఉంది. ఇక్కడ నీరు ద్రవరూపంలో ఉండటంతోపాటు జీవులు మనుగడ సాగించే వీలుంది. దీంతో ఇక్కడ ఏమైనా జీవులు వుంటే.. వారితో మాట్లాడటమే లక్ష్యంగా మెసేజింగ్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎంఈటీఐ) నిపుణుల సందేశాన్ని పంపారు. దీనికి 25ఏళ్లలో గ్రహాంతరవాసుల నుంచి ప్రత్యుత్తరం వచ్చే వీలుందని ఖగోళ నిపుణుల డగ్లస్‌ వాకోచ్‌ తెలిపారు. 2017 అక్టోబరులో నార్వేలోని ఆంటెన్నా సాయంతో సందేశాన్ని పంపామని వివరించారు. దీనిలో గణితంలోని వివిధ అంశాలతో పాటు రేడియో తరంగాలకు సంబంధించిన సంకేతానూ పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
views: 1085



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams