Current Affairs Telugu Daily

2036లో మహావిలయం తప్పదని నాసా అంచనా 
సమీప భవిష్యత్తులో భారీ గ్రహశకమొకటి భూమిని ఢీకొట్టబోతోందని, మహావినాశనానికి అది కారణమవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వర్గాలు వెల్లడిస్తున్నాయి. నాసా శాస్త్రవేత్తలు 2004లో ‘అపోఫిస్‌’ అనే గ్రహశకలాన్ని గుర్తించారు. నాటినుంచి దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అత్యాధునిక విధానాల్లో దాని ప్రయాణమార్గాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. తాజా అంచనా ప్రకారం.. 2036 ఏప్రిల్‌ 13న ఈ భారీ గ్రహశకం భూమిని ఢీకొట్టబోతోంది. ఫలితంగా భూగ్రహంపై మానవులు అంతరించిపోయే ముప్పు కూడా ఉంది. ఈ మేరకు నాసా తమ వెబ్‌సైట్‌లో వివరాలు పొందిపర్చిందని అమెరికా గూఢచర్య సంస్థ ఒకటి వెల్లడించింది. 2029లోనే ‘అపోఫిస్‌’ భూమికి సమీపం నుంచి వెళ్తుందని.. అప్పుడు దాని ప్రయాణమార్గంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నా భూమిని ఢీకొని మహాప్రళయం చోటుచేసుకుంటుందని కూడా నాసా చెబుతున్నట్లు గూఢచర్య సంస్థ పేర్కొంది.
views: 981

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams