Current Affairs Telugu Daily

మహిళలు, బాలల ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర దుష్ప్రభావం : WHO
పర్యావరణ కాలుష్యా వల్లనే దాదాపు 17 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 2016 సంవత్సరపు గణాంకాలు వెల్;వెల్లడించాయి. 2016`30 మధ్య మహిళలు, పిల్లలు, కౌమారుల ఆరోగ్యం మెరుగుకు ప్రపంచ వ్యూహం ఎలా ఉండాలనే దానిపై డబ్ల్యూహెచ్‌ఓ తయారుచేసిన ముసాయిదా అనేక కీలకాంశాలను ప్రస్తావించింది. 
పర్యావరణ కాలుష్య ముప్పులు
- కాలుష్య ఇంధనాలు, వంటస్టవ్‌ సాంకేతిక పరిజ్ఞాన లోపాల వల్ల ఏర్పడే గృహ కాలుష్యాలకు 2012లో దాదాపు 40 లక్షల ముందస్తు మరణాలు సంభవించాయి. 
- మహిళలు వంటింటి పొగకు ప్రభావితం కావడం వల్ల సంభవించిన మరణాల శాతం ఇలా ఉంది.
    శ్వాసకోస సంబంధ సమస్యలకు-34% మంది 
    గుండెపోటుకు- 21% మంది 
    కేన్సర్‌కు - 19 శాతం మంది 
    హృద్రోగ సమస్యలకు- 14% మంది 
- అసలు విద్యుత్తే అందుబాటులో లేక సహారా ఎడారి చుట్టుపక్కలున్న 11 దేశాల్లో 26 % మరణాలు సంభవించాయి. 
- 54 మధ్య ఆదాయ దేశాల్లో కనీసం 38 శాతం ఆరోగ్య కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. 
- విశ్వసనీయ ఇంధనం, పరిశుద్ధ జలాలను అందివ్వడం ద్వారా ప్రసూతి, శైశవ మరణాలను నివారించవచ్చొని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. 
- గృహ, ఇంధన రంగాల సమన్వయంతో- వంటస్టవ్ లు, హీటింగ్‌ వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచి, శుద్ధ ఇంధనాన్ని అందించినట్లయితే మరణాల్ని తగించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా  300 కోట్ల మంది ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ వివరిస్తోంది. బాలల ఆరోగ్య సమస్యల్నీ నివారించవచ్చునంటోంది. 
- గాలి కాలుష్యం వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారు. 
- దాదాపు 92% పట్టణ జనాభా డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన మార్గదర్శకాల స్థాయికన్నా ఎక్కువగా సగటు వార్షిక వాతావరణ కాలుష్యాలకు ప్రభావితమవుతోంది. 
- పిల్లలు ఆడుకోవడానికి తగినన్ని మైదానాలు లేకపోవడం బాలల్లో ఊబకాయం పెరగడానికి కారణమవుతోంది.
WHO-World Health Organization

views: 911

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams