Current Affairs Telugu Daily

పనాజిలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం 
గోవాలోని పనాజిలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2017 నవంబర్‌ 20న ప్రారంభమయింది. డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఇండోర్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌ ఖాన్‌, శ్రీదేవి, షహీద్‌ కపూర్‌, ఏఆర్‌ రెహ్మాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్‌ పనోరమా విభాగంలో ఎస్‌.దుర్గ, న్యూడ్‌ చిత్రాల ప్రదర్శనను ప్రభుత్వం రద్దు చేయడం కూడా వివాదాస్పదమయింది. ఇందుకు నిరసనగా జ్యూరీ అధ్యక్షుడు సుజయ్‌ ఘోష్‌, సభ్యులు అపూర్వ అస్రాని, గ్యాన్‌ కొర్రేయాలు రాజీనామా చేశారు.
views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams