Current Affairs Telugu Daily

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గ్రహీతల్లో అగ్రస్థాయిలో నిలిచిన తండ్రీతనయులు 
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన తండ్రీతనయులు పెంటకోట రాజేష్‌, షణ్ముఖ్‌మాధవ్‌ సరికొత్త ఘనత సాధించారు. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గ్రహీతల్లో అగ్రస్థాయిలో నిలిచారు. గత 15ఏళ్లలో నమోదయిన రికార్డుల్లో దేశంలోనే ఉత్తమంగా ఎంపికచేసిన 100మందిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురికి స్థానం లభించింది. వారిలో ఈ తండ్రీకొడుకులు రెండు అవార్డులు దక్కించుకున్నారు. సాంకేతిక రంగంలో నైపుణ్యమున్న రాజేష్‌ ఆరడుగుల మానవ శరీర నమూనాను రూపొందించి ఆంధ్ర వైద్య కళాశాలకు అందజేశారు. దీనితో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. ఈనేపథ్యంలో రాజేష్‌ ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సుతోపాటు ఇతర అవార్డులు, రివార్డులు పొందారు. ఆయన కుమారుడు షణ్ముఖ్‌ సెల్‌టవర్ల వల్ల అంతరించిపోతున్న పిచ్చుకలపై ‘స్ఫియర్‌ ఆన్‌ స్పారో’ పేరుతో చిత్రీకరించిన 4 నిమిషా చిత్రానికి పలు జాతీయ బహుమతులు దక్కాయి. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోనూ పేరు నమోదు చేసుకున్నారు. వీరికి డిల్లీలో జరిగిన 8 దేశాల స్థాయి సదస్సులో రికార్డు అందజేశారు.
views: 1068

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams