Current Affairs Telugu Daily

కొత్త తరం క్షిపణి డాంగ్‌ఫెంగ్‌-41ను రూపొందించిన చైనా 
బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే  అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఇది వచ్చే ఏడాది సైన్యం అమ్ములపొదిలో చేరుతుందని వివరించింది. డాంగ్‌ఫెంగ్‌-41 అనే ఈ క్షిపణి.. ధ్వని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. శత్రుదేశపు క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థను ఏమార్చి దాడులు చేయగలదు. ఈ అస్త్రంలో  మూడు అంచెలు ఉన్నాయి. అవన్నీ ఘన ఇంధనంతో పనిచేస్తాయి. ఈ క్షిపణి కనీసం 12వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. అంటే.. ప్రపంచంలో ఏ ప్రాంతంమీదైనా ఇది విరుచుకుపడగలదు. తనతోపాటు 10 అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రయోగానంతరం.. అవన్నీ క్షిపణి నుంచి విడిపోయి.. నిర్దేశించిన రీతిలో వేరువేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. అమెరికాను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్లు భావిస్తున్నారు.
views: 960

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams