Current Affairs Telugu Daily

అణు జలాంతర్గామి అరిధామన్‌ ప్రవేశం
భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత రక్షణరంగం శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే ధీశాలి ఐఎస్‌ఎస్‌ ఆరిధామన్‌ నేవీలో చేరడానికి తొలి అడుగు వేసింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ ఆరిహంత్‌ 2009 జూలైలో ప్రారంభమైంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఆరిధామన్‌ 2017 నవంబర్‌ 19న రంగప్రవేశం చేసింది. ఈ అణు జలాంతర్గామిని విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ అత్యంత రహస్యంగా ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఇలాంటి కార్యక్రమాలను రహస్యంగా నిర్వహించడం రక్షణశాఖలో పరిపాటి. 
- ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్‌, రష్యా ఫ్రాన్స్‌ చైనాలు మాత్రమే అణు జలాంతర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్‌ ఆరిహంత్‌తో స్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌లు కలిగిన ఆరో దేశంగా భారత్‌ చేరింది. 
- అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెసల్‌ (ఏటీవీ) ప్రాజెక్టు కింద మొత్తం 5 అణు జలాంతర్గాములను నావికాదళం కోసం భారత్‌ నిర్మించ తలపెట్టింది. 
- ఇందులో మొదటిది ఐఎన్‌ఎస్‌ ఆరిహంత్‌ కాగా, రెండోది ఆరిధామాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్‌ డాక్‌ యార్డులోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌(ఎస్బీసీ)లో ఈ ఐదు అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. మిగిలినవి మూడు దశ వారీగా పూర్తి కానున్నాయి. 
- ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ కంటే ఐఎన్‌ఎస్‌ ఆరిధామన్‌ దాదాపు రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. 
- ఈ ఐఎన్‌ఎస్‌ ఆరిధామన్‌ సముద్ర సన్నాహాలు (సీ ట్రయల్స్‌), ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేరడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.

views: 1490

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams