తలసరి GDPలో 126వ స్థానంలో భారత్‌
తలసరి స్థూల జాతీయోత్పత్తి (GDP)లో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్‌లో మాత్రం భాగస్వామ్య దేశాలన్నింటి కంటే చివరన ఉంది. ర్యాంకింగ్స్‌లో 12480 డాలర్ల తలసరి ఆదాయంతో ఖతార్‌ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఈ  గణాంకాలు విడుదల చేసింది. కొనుగోలు శక్తిలో సమానత (PPP) ఆధారంగా 200 దేశాలకు ర్యాంకుల్ని కేటాయించారు. భారతదేశ తలసరి జీడీపీ 2016లో 6690 డాలర్లు (రూ.4,48,230) ఉంటే ఈ ఏడాది 7170 డాలర్లకు (రూ.4,80,390) పెరిగింది. తద్వారా ర్యాంకు కొద్దిగా మారింది. ఈ విషయంలో ఖతార్‌ 1,24,930 డాలర్లతో (సుమారు రూ.83.70 లక్షలు) ప్రపంచంలో అగ్రస్థాయిని నిలబెట్టుకొంది. మకావ్‌, లగ్సెంబర్గ్‌లు ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. బ్రిక్స్‌ దేశాల్లో రష్యా (27,900 డాలర్లు) అగ్రస్థానంలో ఉంది. చైనా (16,620 డాలర్లు), బ్రెజిల్‌ (15,500 డాలర్లు), దక్షిణాఫ్రికా (13,400 డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కొనుగోలు శక్తి ఆధారంగా(పర్చేజ్‌ పవర్‌ ప్యారిటీ) ప్రపంచంలోని 200 దేశాల GDPలను లెక్కలోకి తీసుకొని IMF ఈ ర్యాంకింగ్స్‌ నిర్ణయించింది. ఇటీవలి ప్రపంచ ఆర్ధిక ముఖచిత్రం నివేదికలో భాగంగానే ఈ జాబితాసు కూడా ప్రవేశపెట్టింది. 
జాబితా
1    ఖతార్‌    
2    మకావు
3    లగ్జెంబర్గ్‌
4    సింగపూర్‌
5    బ్రూనై
6    ఐర్లాండ్‌
7    నార్వే
8    కువైట్‌
9    యూఏఈ
10    స్విట్జర్లాండ్‌
13    అమెరికా
126    ఇండియా
- ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం భారత్‌లో కోటీశ్వరులు 2.45 లక్షల మంది ఉన్నారు. వీరందరి సంపద కలిపితే 5 ట్రిలియన్‌ డాలర్లు (రూ.335 లక్షల కోట్లు). 
- ఐ.ఎం.ఎఫ్‌. గణాంకాల ప్రకారం తలసరి జీడీపీలో ప్రపంచ ధనిక దేశాల్లో సింగపూర్‌, బ్రూనై, ఐర్లాండ్‌, నార్వే, కువైట్‌, యూఏఈ, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. 
- తొలి పది స్థానాల్లో అమెరికా లేదు. ఆ దేశం 13వ స్థానంలో ఉంది. యూకే ఇంకా వెనుకబడిపోయింది. 
- ఇంధన సంబంధిత ఆదాయం వల్ల ఖతార్‌, బ్రూనై రాణించగా... పెట్టుబడులు, బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థల కారణంగా ఐస్‌ల్యాండ్‌, ఐర్లాండ్‌ వంటి దేశాలు ఆర్థిక వృద్ధి సాధించాయి. 
పర్చేజ్‌ పవర్‌ ప్యారిటీ(PPP) 
- ఏదైనా ఒక దేశం కరెన్సీని మరో దేశం కరెన్సీలోకి మార్పిడి చేసినప్పడు మొదటి దేశంలోని నిర్దేశిత కరెన్సీతో ఏ విధంగా వస్తు, సేవల పరిమాణం లభిస్తుందో, అదేవిధంగా రెండో దేశంలో కూడా మొత్తం(కరెన్సీని మార్పిడి చేయడం ద్వారా లభించే సొమ్ము)తో అంతే పరిమాణంలో సేవలు, వస్తువులను కొనుగోలు చేయగగడాన్ని పర్చేజ్‌ పవర్‌ ప్యారిటీ(PPP) అంటారు.
IMF-International Monetary Fund
GDP-Gross Domestic Product
PPP-Purchasing power parity

views: 1158

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams