Current Affairs Telugu Daily

దేశంలోని రహదారులకు రేటింగ్‌
దేశంలోని రహదారులకు స్టార్‌ రేటింగ్‌ ఇవ్వాలని ఓ అంతర్జాతీయ సంస్థ నిర్ణయించింది. సురక్షితమైన రహదారికి 5 స్టార్‌, ఏ మాత్రం బాగోలేని రహదారికి 1 స్టార్‌ ఇవ్వనుంది. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్డు ప్రమాణాలు కనీసం 3 స్టార్‌లో ఉండాలి. అంతర్జాతీయ రహదారుల మదింపు కార్యక్రమం (ఇంటర్నేషనల్‌ రోడ్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం-ఐర్యాప్‌) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందుకోసం రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాపై అధ్యయనం చేస్తున్నామని ఆ సంస్థ సీఈవో రాబ్‌ మక్లెర్నరీ చెప్పారు. ప్రపంచబ్యాంకు, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర 12 రాష్ట్రాల్లోని 12 వేల కి.మీ. మేర జాతీయ, రహదారుల పరిస్థితులను గమనించారు. డిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాను కలుపుతున్న స్వర్ణ చతుర్భుజిలో మరో 5000 కి.మీ.ను అధ్యయనం చేయనున్నారు. దేశంలోని సగం కన్నా ఎక్కువ ప్రమాదాలు కేవలం 5 శాతం రోడ్లు కారణంగానే జరుగుతున్నాయని రాబ్‌ చెప్పారు. ఏటా అయిదు లక్షల ప్రమాదాలు జరుగుతుంటే 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, 3 లక్షల మంది గాయపడుతున్నారని వివరించారు. వాహనాల సంఖ్య, వేగం, ప్రయాణికుల భద్రత తదితర అంశాల ఆధారంగా రోడ్లకు రేటింగ్‌ ఇస్తామని చెప్పారు.
views: 1206Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams