Current Affairs Telugu Daily

మన్మోహన్‌సింగ్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2017 సం॥నికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 2004-14 మధ్య దేశానికి ప్రధానిగా సేవలందించి శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి ద్వారా ప్రపంచంలో ఒక స్థాయిలో మన దేశాన్ని నిలబెట్టినందుకు ఆయన ఎంపికయ్యారని ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు తెలిపింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ న్యాయనిర్ణేత మండలి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 2017 నవంబర్‌ 19న దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతిని నిర్వహించారు. డిల్లీలోని శక్తిస్థల్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. 
views: 1271

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams