Current Affairs Telugu Daily

పిల్లల పెంపకంపై పోడర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం
మన దేశంలో పిల్లల రోజువారి బాగోగులు చూసుకోవడంలో తండ్రి పాత్ర పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఎక్కువ మంది పురుషులు పూర్తిగా పిల్లల పెంపకాన్ని తకెత్తుకోలేకపోతున్నారని, భార్య సాయం తీసుకుంటున్నారని వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన పోడర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నిపుణులు ఈ అధ్యయనం చేపట్టారు. 4,800 మంది సమాచారాన్ని వారు విశ్లేషించారు. దీనిలో వెలుగుచూసిన అంశాల్లో కొన్ని.. 
- పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు 70 శాతం మంది తండ్రులు కార్యాలయాలకు చేరుకునేందుకు చేస్తున్న ప్రయాణ సమయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 
- పిల్లల పాఠశాలలు, తరగతులు గురించీ తెలుసుకుంటున్నారు. పాఠశాల్లోని ప్రత్యేక కార్యక్రమాలకూ హాజరవుతున్నారు. 
- 33 శాతం మంది ఇంటి పనులకు సమయం కేటాయిస్తున్నారు. 
- పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు భార్య వెంట ఉండటం తప్పనిసరని 88 శాతం మంది భావిస్తున్నారు.

views: 973

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams