Current Affairs Telugu Daily

క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే ప్రోటీన్‌ గుర్తింపు
క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే కీలక ప్రోటీన్లను పరిశోధకులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌ కణాలను కలిపివుంచుతూ.. కణితుల విస్తరణకు తోడ్పడుతున్నట్లు కనిపెట్టారు. దీంతో శక్తిమంతమైన కొత్తరకం చికిత్సా విధానాలకు మార్గం సుగమమైంది. కెనడాలోని గెల్ఫ్‌ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. రొమ్ము, మెదడు క్యాన్సర్‌ కణాలను వారు ఆక్సీజన్‌ తక్కువగా ఉండే ఇంక్యుబేటర్‌లలో పెట్టి జాగ్రత్తగా పరిశీలించారు. దీంతో క్యాడెరిన్‌-22గా పిలిచే తాజా ప్రోటీన్‌ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఆక్సీజన్‌ తక్కువగా ఉండేటప్పుడు వీటి ఉత్పత్తిని క్యాన్సర్‌ కణాలు పెంచుతున్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. ఈ ప్రోటీన్లు క్యాన్సర్‌ కణాల ఉపరితలంపై అతుక్కుని ఉంటూ.. కణాలను కలిపివుంచుతున్నట్లు గుర్తించారు. ఆరోగ్యవంతమైన కణజాలంపై దాడికి అవసరమైన శక్తినీ ఇవి సమకూరుస్తున్నట్లు తేల్చారు. 
views: 1235

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams