Current Affairs Telugu Daily

మహ్మద్‌ అబ్బాస్‌కు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు 
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్‌ అబ్బాస్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు. 18.44 నిమిషాల వ్యవధిలో 1,016 ద్విచక్ర వాహనాలను తన పొట్ట మీదుగా పోనిస్తూ అరుదైన ఘనత సాధించారు. జనగామ జిల్లా కేంద్రంలోని సెయింట్‌ మేరీస్‌ పాఠశాల ఆవరణలో నవంబర్ 17న  తెలంగాణ బంజార యువసేన, సేవ్‌ జనగామ సంస్థ ఆధ్వర్యంలో అబ్బాస్‌ ఈ రికార్డు నెలకొల్పారు.  అండమాన్‌ నికోబార్‌కు చెందిన జయరామ్‌ అనే యువకుడు 16.40 నిమిషాల వ్యవధిలో 500 ద్విచక్రవాహనాలను తన పొట్టపై నుంచి పోనించుకుని సాధించిన రికార్డును అబ్బాస్‌ తిరగరాశాడు. 
views: 2063

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams