Current Affairs Telugu Daily

భారతీయుల్లో 64% మందికి పాకిస్థాన్‌పై సదభిప్రాయాల్లేవు : ప్యూ
భారత పౌరుల్లో 64 శాతానికి పైగా మందికి పాకిస్థాన్‌ పట్ల సదభిప్రాయాలు లేవని ‘ప్యూ’ పరిశోధన కేంద్రం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 9% పెరిగింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వే ఫలితాలను ప్యూ ప్రతినిధులు 2017 నవంబర్‌ 17న విడుదల చేశారు. 
- జమ్ముకశ్మీర్‌లో కేంద్రం సైనిక బలాన్ని మరింతగా వినియోగించాని 63% మంది అభిప్రాయపడ్డట్లు ఈ సర్వే తెలిపింది. 
- కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినప్పటికీ దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 80 శాతానికిపైగా మంది వెల్లడించినట్లు పేర్కొంది. 
- ఇస్లామిక్‌స్టేట్‌ ప్రధాన ముప్పు అని 66% మంది, ఉగ్రవాదం చాలా పెద్ద సమస్య అని 76% మంది సర్వేలో అభిప్రాయపడ్డారు. 
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల 17% మంది, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పట్ల 4% మంది విశ్వాసం వ్యక్తం చేశారు.

views: 1238

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams