Current Affairs Telugu Daily

ఈ ఏడాది ఎనిమిదో డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
మార్టినా హింగిస్ లాంటి విజయవంతమైన భాగస్వామితో విడిపోయినా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన విజయపరంపరను కొనసాగిస్తోంది. చెక్ రిపబ్లిక్‍కు చెందిన కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా మీర్జా తాజాగా పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‍ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్, ఫైనల్లో రెండో సీడ్ సానియా - స్ట్రికోవా ద్వయం 6 -1, 6-1 తో చెన్ లియాంగ్ - జావోజువాన్ యాంగ్ (చైనా) జంటపై ఘనవిజయం సాధించింది. ఈ ఏడాది సానియాకిది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం.
views: 1028



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams