Current Affairs Telugu Daily

ఆసియాలోని సంపన్న కుటుంబాల్లో అంబానీ కుటుంబానికి ప్రథమ స్థానం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. శామ్‌సంగ్‌ లీ కుటుంబాన్ని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుత సంవత్సరానికి గాను ఆసియాలోని అత్యుత్తమ 50 సంపన్న కుటుంబాతో ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. 
ఈ జాబితా ప్రకారం
- ముకేశ్‌ అంబానీ కుటుంబ సంపద 1900 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.25 లక్షల కోట్లు) పెరిగి 4480 కోట్ల డాలర్ల (సుమారు రూ.3 లక్షల కోట్లు)కు చేరింది. 
- లీ సామ్రాజ్యం రెండో స్థానానికి పడిపోయినప్పటికీ సంపద పెరిగింది. ఏడాది కాలంలో శామ్‌సంగ్‌ షేరు 75 శాతం లాభపడటంతో లీ కుటుంబ సంపద 1120 కోట్ల డాలర్లు పెరిగి 4080 కోట్ల డాలర్లు చేరింది. 
- ఆసియాలోనే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యంత శ్రీమంతులుగా ఉన్న క్వోక్‌ కుటుంబం (హాంకాంగ్‌) మూడో స్థానంలో నిలిచింది. వీరి నికర సంపద 4040 కోట్ల డాలర్లు. 
- తొలి 10 అత్యంత శ్రీమంతుల కుటుంబాల్లో భారత్‌ నుంచి అంబానీలకు తప్ప మరెవరికీ చోటు దక్కలేదు.
- లి డాలరు రూపేణా, శాతం పరంగా ఈ ఏడాది ముకేశ్‌ అంబానీ కుటుంబం స్థాయిలో ఎవరి సంపద వృద్ధి చెందలేదని ఫోర్బ్స్‌ తెలిపింది. రియన్స్‌ ఇండస్ట్రీస్‌ రిఫైనింగ్‌ మార్జిన్లు పెరగడం, జియో కార్యకలాపాలు ప్రారంభమవడం ఇందుకు దోహదం చేశాయని పేర్కొంది.
- భారత్‌ నుంచే అత్యధికంగా 18 కుటుంబాలకు చోటు దక్కింది. వరుసగా మూడేళ్లుగా భారత్‌ ఈ ఘనతను సాధించింది
- జాబితాలోని 50 కుటుంబాల సంయుక్త సంపద 69900 కోట్ల డాలర్లు. ఏడాది క్రితంతో పోలిస్తే 20000 కోట్ల డాలర్లు పెరిగింది.
- 2017 నవంబరు 3 మార్కెట్‌ ముగింపు నాటికి నమోదైన షేరు ధరు, మారకపు రేట్లు ఆధారంగా ఈ కుటుంబాల సంపదను ఫోర్బ్స్‌ లెక్కగట్టింది. ఆర్థిక నిష్పత్తి, ఇతర పోటీ కంపెనీతో పోలుస్తూ ప్రైవేట్‌ కంపెనీ విలువలను గణించింది.
- జాబితాలో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద విలువ 500 కోట్ల డాలర్లు. 2016లో ఇది 160 కోట్ల డాలర్లుగా ఉంది.

views: 1173



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams