Current Affairs Telugu Daily

ఓడీఎఫ్‌ జాబితాలో మెదక్‌ జిల్లా 
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టడం ద్వారా మెదక్‌ జిల్లా బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) జిల్లాగా ఆవిర్భవించింది. ప్రధాన మంత్రి పిలుపు మేరకు స్వచ్చభారత్‌ నిర్మాణంలో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మింపజేసేందుకు జిల్లా కలెక్టర్‌ భారతి హొళికెరి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేశారు. కేవలం 11 నెలల కాలంలో జిల్లాలో 56,452 మరుగుదొడ్లను పూర్తి చేయించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 జిల్లాలను ఓడీఎఫ్‌గా ప్రకటించగా.. మెదక్‌ జిల్లా ఎనిమిదోది. కొత్తగా ఏర్పాటైన మెదక్‌ జిల్లా స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలిచింది.
views: 1576

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams