Current Affairs Telugu Daily

హెచ్‌1బీ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం 
హెచ్‌1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధం చేసిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న కనీస వార్షిక వేతనం రూ.39.15 లక్షలు (60,000 డాలర్లు)ను రూ.58.73 లక్షలు (90,000 డాలర్లు)గా పెంచేందుకు దీనిలో ప్రతిపాదను చేశారు. అంతేకాదు వీసా నిబంధను కఠినతరం చేసేందుకు కూడా చర్యలను ప్రతిపాదించారు. ఈ వీసాకు భారత ఐటీ నిపుణుల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వీరితో భర్తీచేయకుండా తాజా బిల్లులో ఆంక్షలు సిద్ధం చేశారు. అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు బిల్లు(హెచ్‌ 170) పేరిట ఈ బిల్లును రిపబ్లికన్‌ చట్టసభ సభ్యుడు డారెల్‌ ఇస్సా ప్రవేశపెట్టారు. దీన్ని న్యాయ వ్యవహారాల కమిటీ ఆమోదించింది. తదుపరి చర్యల నిమిత్తం కాంగ్రెస్‌కు పంపుతారు. అనంతరం అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదముద్ర పడితే ఇది చట్టరూపం దాలుస్తుంది. అమెరికా కార్మికుల స్థానంలో హెచ్‌1బీ వీసాదారులను తీసుకునేందుకు కొన్ని సంస్థలకు ఇచ్చే సడలింపును తాజా బిల్లులో ఎత్తివేశారు. హెచ్‌1బీ వీసాపై ఆధారపడే ఉద్యోగల సంస్థలు మొదటగా అమెరికా ఉద్యోగులను నియమించేలా దీనిలో చర్యలు ప్రతిపాదించారు.
views: 1106



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams