Current Affairs Telugu Daily

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌
ఉగ్రవాదం మరింతగా విస్తరించిందని, 77 దేశాలపై దాని ప్రభావం ఉందని ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ వెలువరించిన ప్రపంచ తీవ్రవాద సూచి (గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌- జీటీఐ)లో వెల్లడయింది. అమెరికాలకు చెందిన మేరీలాండ్‌ విశ్వవిద్యాలయం సహకారంతో గత 17 ఏళ్లుగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ సంస్థ సేకరిస్తున్న వివరాల ప్రకారం 2016లో ఉగ్రవాదం వ్యాప్తి పెరగగా, మరణా సంఖ్య తగ్గింది. ఆ ఏడాది మొత్తం 25,673 ఉగ్రవాద మరణాలు నమోదయ్యాయి. సిరియా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, నైజీరియాల్లో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టడంవల్లనే మృతుల సంఖ్య తగ్గింది. 2015తో పోల్చితే అదనంగా 12 దేశాలు ఉగ్రవాదం బారిన పడడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. యూరోప్‌ దేశాల్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రభావం పెరుగుతోందని వివరించింది.
views: 1478

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams