Current Affairs Telugu Daily

సైన్యం నియంత్రణలో జింబాబ్వే 
జింబాబ్వేను ఆ దేశ సైన్యం తమ నియంత్రణలోకి తీసుకుంది. దేశాధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే(93)ను గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని హరారేలో బలగాలను భారీగా మోహరించింది. దీంతో సైన్యం తిరుగుబాటు చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సైనికవర్గాలు స్పందించాయి. తాము తిరుగుబాటు చేయట్లేదని స్పష్టం చేశాయి. ముగాబే సురక్షితంగా ఉన్నారనివెల్లడించాయి. ఆయన చుట్టూ ఉన్న నేరగాళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపాయి. ఆర్థికమంత్రి ఇగ్నాటియస్‌ చాంబోను సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దేశ ఉపాధ్యక్ష పదవి నుంచి ఎమర్సన్‌ ఎమ్నంగగ్వాను ముగాబే తొలగించడంపై ఆగ్రహంతోనే సైన్యం తాజా చర్యలకు దిగినట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. 
views: 1258

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams