Current Affairs Telugu Daily

‘ఓ’ బ్లడ్‌  గ్రూపు వారికి వాయు కాలుష్యంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ 
వాయు కాలుష్యానికి గురయ్యేవారిలో గుండె పోటు ముప్పు స్థాయి రక్త గ్రూపులను బట్టి వేర్వేరుగా ఉన్నట్లు అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్‌ మెడికల్‌ సెంటర్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘ఓ’ గ్రూపు వారికి 10% ముప్పు ఉంటే.. మిగతా గ్రూపు వారికి 25% ఉంటున్నట్లు పరిశోధకుల వెల్లడించారు. ‘ఏ’, ‘బీ’, ‘ఏబీ’ గ్రూపు రక్తం ఉన్నవారిలో ‘ఏబీఓ’ జన్యువు ఉంటుంది. ఇది ఉన్నవారు హృదయ ధమనులకు సంబంధించిన వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే చాలా అధ్యయనాలు బయటపెట్టాయి. మరిన్ని అంశాలు తోడైతేనే హృదయ ధమనుల వ్యాధు గుండె పోటుగా రూపాంతంరం చెందుతాయని పరిశోధకు తెలిపారు. వాయు కాలుష్యం క్యూబిక్‌ మీటర్‌కు 25 మైక్రోగ్రాముకు మించితే.. గ్రూపు మధ్య ముప్పులో తేడా కనబడుతున్నట్లు పేర్కొన్నారు.
views: 1320

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams