ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల్లో ఖాన్‌ మార్కెట్‌కు 24వ స్థానం
దేశ రాజధానిలోని ఖాన్‌ మార్కెట్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల్లో 24వ స్థానంలో నిలిచింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే నాలుగు స్థానాలు పైకి వెళ్లిందని కష్‌మాన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక తెలుపుతోంది. గతేడాది కాంగా ఖాన్‌ మార్కెట్లో నెలవారీ అద్దె అడుగుకు రూ.1250గా స్థిరంగా ఉంటోంది. 2016లో ఈ మార్కెట్‌కు 28వ స్థానం దక్కింది. కొన్ని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో అద్దెలు తగ్గడం ఇందుకు కారణమైంది. 
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాలు
ర్యాంక్‌    ప్రాంతం
1    అప్పర్‌ ఫిఫ్త్‌ అవెన్యూ, న్యూయార్క్‌
2    కాజ్‌వే బే, హాంకాంగ్‌ 
3    బాండ్‌ స్ట్రీట్‌, లండన్‌
24    ఖాన్‌ మార్కెట్‌, న్యూడిల్లీ
ప్రపంచవ్యాప్తంగా 66 దేశాల్లోని 400 రిటైల్‌ ప్రాంతాలను వార్షిక సర్వే కోసం ఎంచుకున్నారు. 

views: 1148

Current Affairs Telugu
e-Magazine
August-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams