Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ఉబర్‌ ఈట్స్‌ సేవలు 
అద్దె కార్ల అగ్రిగేటర్‌ ఉబర్‌ తన ఉబర్‌ఈట్స్‌ సేవలను హైదరాబాద్‌కు విస్తరించింది. ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసి, కోరుకున్న చోటికి తెప్పించుకునేందుకు వీలు కల్పించే యాప్‌ ఉబర్‌ఈట్స్‌. ఇప్పటికే దేశంలో ముంబయి, డిల్లీ, గురుగ్రామ్‌, బెంగళూరు, చెన్నై, చండీగఢ్‌లో ఉబర్‌ఈట్స్‌ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఖాతాదారులను ఆకట్టుకోవడం కోసం ఆహార పదార్థాలను అందించినందుకుగాను రూ.1ని రుసుముగా వసూలు చేయనుంది. 2017 నవంబర్‌ 15న హైదరాబాద్‌లో సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఉబర్‌ఈట్స్‌ మొబైల్‌ యాప్‌ సేవలను ప్రారంభించారు. 
views: 1481

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams