Current Affairs Telugu Daily

కేరళ మంత్రి థామస్‌ చాందీ రాజీనామా 
కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి థామస్‌ చాందీ కబ్జా కేసులో చిక్కుకుని పదవికి రాజీనామా చేశారు. థామస్‌కు చెందిన కుట్టనాడ్‌లోని లేక్‌ప్యాలెస్‌ రిసార్టు కబ్జాకు పాల్పడటంతో పాటు బ్యాక్‌వాటర్‌ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ప్రభుత్వానికి అపుళ జిల్లా కలెక్టర్‌ అనుపమ నివేదిక సమర్పించారు. ఈ నివేదికను సవాల్‌ చేస్తూ థామస్‌ హైకోర్టును ఆశ్రయించగా మంత్రి పదవిలో ఉంటూ ప్రభుత్వ అధికారిపైనే కేసు దాఖలు  చేయటం ఏమిటని ధర్మాసనం చివాట్లు పెట్టింది. మంత్రి పదవిని వీడి న్యాయస్థానానికి రావాలని స్పష్టం చేసింది. 
- 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ఎన్‌సీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకే జయరాజన్‌, థామస్‌ చాందీ వివాదాల్లో చిక్కుకుని మంత్రి
పదవులను కోల్పోయారు. సీపీఎంకే చెందిన ఈపీ జయరాజన్‌ అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. 
- కేరళ ముఖ్యమంత్రి : పినరయి విజయన్‌ 

views: 1195

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams