Current Affairs Telugu Daily

లక్కంపల్లిలో పతంజలి యూనిట్‌ 
తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి సంస్థ ముందుకొచ్చింది. 2017 నవంబర్‌ 15న హరిద్వార్‌లో బాబారాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో సంస్థ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పసుపు ఉత్పత్తిలో ముందజంలో ఉన్న తెలంగాణలో ఆయుర్వేద, ఆహార ఉత్పత్తుల  సంస్థను ఏర్పాటు చేయాలని గతంలో రాందేవ్‌ను ఎంపీ కవిత కోరారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండం లక్కంపల్లిలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి అంగీకరించింది. ఇక్కడ పసుపు, మిర్చి, మక్కు, సోయా సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలను శుద్ధి చేసి వాటిని దేశంలోని పతంజలి యూనిట్లకు సరఫరా చేస్తారు. 
views: 1372

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams