Current Affairs Telugu Daily

ప్రజాదరణలో నరేంద్రమోడి ముందంజ : ప్యూ
ప్రధాని నరేంద్రమోడి భారతదేశంలోని నాయకులందరిలోనూ ప్రజాదరణలో చాలా ముందున్నారని అమెరికాకు చెందిన ప్యూ(పీఈడబ్ల్యు) సంస్థ సర్వేలో వెల్లడయింది. నరేంద్రమోడికి 88 శాతం మంది మద్దతు తెలపగా, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి 58 శాతం, సోనియాగాంధీకి 57 శాతం మంది మద్దతు తెలిపారు. దక్షిణాది సహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాని నరేంద్రమోడియే ముందున్నారు. 2017 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించేలా 2464 మంది అభిప్రాయాలను సేకరించినట్లు ప్యూ సంస్థ పేర్కొంది.
views: 1185

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams