Current Affairs Telugu Daily

గ్రామీణ భారత పరిస్థితిపై నీతి ఆయోగ్‌ నివేదిక
గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ పనులను వదిలేసి ఇతర రంగాల వైపు మొగ్గుచూపుతున్నారని, పని మానేసిన మహిళలు ఇంటికే పరిమితమవుతుండగా, పురుషులు మాత్రం ఇతర రంగాల్లోకి వెళ్లిపోతున్నారని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌చంద్‌ మరో ఇద్దరు సభ్యులతో కలిసి చేసిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను ‘భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మార్పు-ఉపాధి, వృద్ధిపై దాని ప్రభావం’ అన్న పేరుతో నివేదికను వెల్లడించారు. యూపీయే హయాంలో 3.3 కోట్ల మంది కూలీలు వ్యవసాయ పనులు వదిలేసినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో 2.7 కోట్ల మంది మహిళలే ఉన్నారు. 
- కుటుంబాల ఆర్థిక పరిస్థితి పెద్దగా మెరుగుపడకపోయినా మహిళలను పనులను మాన్పించి ఇంటి పనులకు పరిమితం చేస్తున్నట్లు తేలింది. మహిళలను చదువులకు పంపడమే ఇందుకు కారణమని మొదట్లో అనుకున్నా అది వాస్తవం కాదని తేలింది. 2004-12 మధ్య కాలంలో రైతు, కూలీ ఆదాయం పెరిగిందని, అందుకే మహిళలను పనుల నుంచి మాన్పించినట్లు ఒక వాదన ఉంది. 1999-2005 మధ్య వచ్చిన వ్యవసాయరంగ సంక్షోభం వల్లే మహిళలు విధిలేని పరిస్థితుల్లో కూలీలుగా మారారని, తర్వాత ఆ పరిస్థితి మెరుగవడంతో ఇళ్లకే పరిమితమయ్యారన్న మరో వాదనా ఉంది. ఈ రెండు వాదనల్లోనూ పసలేదని నీతి ఆయోగ్‌ సభ్యులు పేర్కొన్నారు. 
- వ్యవసాయేతర కుటుంబాల మహిళలు కూడా పనులకు దూరమయినట్టు తెలిపారు. పొలం పనులు మానేసిన మహిళల్లో కేవలం 50 లక్ష మంది మాత్రమే ఇతర రంగాల్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. సామాజిక మార్పు కారణంగా వ్యవసాయ కూలీలు, యజమానుల మధ్య అలజడులు పెరుగుతుండటం, ఇతర రంగాల్లో చేరడానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, తయారీ రంగాలు అందుబాటులో లేకపోవడంతో మహిళలు పొలం పనులు మానేసి ఇంటి పట్టున ఉండాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.

views: 996

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams