జర్మనీలో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఆవిర్భావ కార్యక్రమం
ఇంటర్నేషనల్ సోలార్ అయెన్స్ ఆవిర్భావ కార్యక్రమాన్ని 2017 నవంబర్ 14న జర్మనీలోని బాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత నూతన, పునరుత్పాదక శక్తి వనరుల శాఖ కార్యదర్శి ఆనంద్‌కుమార్ హాజరయ్యారు. 2015 నవంబర్ 30న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన కాప్-21 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడి, ఫ్రాన్స్ అధ్యక్షుడు హెచ్.ఇ.ఫ్రాంకోయిస్ హోలాండేలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్‌ను ప్రారంభించారు.
views: 1198