Current Affairs Telugu Daily

అధిక రక్తపోటు సూచీ 130/80
అధిక రక్తపోటు సూచీని 130/80 ఎంఎంహెచ్‌జీగా సవరిస్తూ అమెరికా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదివరకు ఇది 140/90 ఎంఎంహెచ్‌జీగా ఉండేది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ), అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ కార్డియాలజీ (ఏహెచ్‌ఏ) సంయుక్తంగా ఈ మార్గదర్శకాలను విడుదల చేశాయి. అధిక రక్తపోటు చికిత్స, నియంత్రణ, నిర్ధరణ, నిర్వహణలో ఇవి తోడ్పడతాయని పరిశోధకు తెలిపారు. 
- ఇదివరకు అమెరికాలో 32 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు ఉండేవారు. తాజా మార్పుతో ఇది 46 శాతానికి పెరిగింది. కొత్తగా చికిత్సా మార్గాలను ఆశ్రయించాల్సిన వారి సంఖ్య సైతం ప్రస్తుతం పెరగనుంది. 
- రక్తపోటు అంచనాలకు సరైన సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరాన్ని మార్గదర్శకాల్లో నిపుణుల నొక్కిచెప్పారు. కనీసం రెండు భిన్న సందర్భాల్లో మూడేసిసార్లు చొప్పున తీసిన అంచనా సగటు ఆధారంగా దీన్ని లెక్కించాలని సూచించారు. 
- 130/80లో 130 ఊర్ధ్వ, 80 నిమ్న రక్తపీడనాలను సూచిస్తాయి. 
- నియంత్రించగలిగే హృద్రోగ, పక్షవాత మరణాల్లో ఎక్కువ ధూమపానం వల్లే సంభవిస్తాయి. 
- ఈ తర్వాతి స్థానం అధిక రక్తపోటుదే. దీన్ని ‘సైలెంట్‌ క్లిర్‌’గా నిపుణుల అభివర్ణిస్తుంటారు. పైకి క్షణాలు కనిపించకపోయినా ఇది హృద్రోగ, పక్షవాత ముప్పును విపరీతంగా పెంచుతుంది. 
- 130 నుంచి 139/ 80 నుంచి 89 మధ్య రక్తపోటు ఉండేవారికి ఆరోగ్యవంతుల కంటే రెండు రెట్లు ఎక్కువగా హృద్రోగాల ముప్పు ఉంటుంది. దీని గురించి అందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాజా మార్పు చేశామని పరిశోధకు వెల్లడించారు
- అంటే 130 నుంచి 139 మధ్య ఉండేవారు తప్పకుండా ఔషధాలు తీసుకోవాలని కాదని, రక్తపోటును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని పరిశోధకులు తెలిపారు. 

views: 1744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams