Current Affairs Telugu Daily

2018 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఇటలీకి అనర్హత 
2018లో జరగనున్న ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించలేకపోయింది. 1952 తర్వాత ఎన్నడూ ఆ జట్టు ప్రపంచకప్‌కు దూరం కాలేదు. 60 ఏళ్ల విరామం తర్వాత ఇటలీ ప్రపంచకప్‌కు దూరమైంది. 1958 ప్రపంచకప్‌ తర్వాతి నుంచి ప్రతిసారీ ఈ మెగా టోర్నీలో ఆడుతూ వస్తున్న ఈ జట్టు 2018లో రష్యా ఆతిథ్యమివ్వబోతున్న మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ఈ ప్రపంచకప్‌కు దూరమైన అతి పెద్ద జట్టు ఇటలీనే. ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006) ప్రపంచకప్‌ గెలిచిన ఘన చరిత్ర ఉన్న ఇటలీ.. ప్రపంచకప్‌ అర్హత కోసం చివరగా స్వీడన్‌తో జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించడంతో ఈ టోర్నీకి దూరమైంది.  ఇటలీ ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంతో ఆ దేశమంతటా విచారకరమైన వాతావరణం నెలకొంది. ఆ దేశ మీడియా తమ జట్టుపై దుమ్మెత్తిపోస్తోంది.
views: 1677

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams