Current Affairs Telugu Daily

విద్యుత్‌తో నడిచే సరకు రవాణా నౌకను తొలిసారి రూపొందించిన చైనా 
ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి విద్యుత్‌ నౌకను చైనాలో ప్రారంభించారు. దీన్ని రెండు గంట ఛార్జింగ్‌ చేస్తే 2వేల టన్నుల సరకును 80 కిలోమీటర్ల పాటు మోసకెళుతుంది. దక్షిణ చైనాలోని గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని గువాంగ్‌ఝౌలో దీన్ని  ప్రారంభించారు. ఈ నౌక పొడవు 70.5 మీటర్లు. బరువు 600 టన్నులు. ఇది 26 టన్నుల లిథియం బ్యాటరీతో నడుస్తుంది. గరిష్టంగా గంటకు 12.8 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ నౌకలో శిలాజ ఇంధనాలను ఉపయోగించరు. అందువల్ల దీని నుంచి హానికర ఉద్గారాలు వెలువడవు. దీన్ని ప్రయాణికుల నౌకగా కూడా ఉపయోగించవచ్చు. ప్రారంభోత్సవం తర్వాత దీన్ని పెర్ల్‌ నదిపై నడిపారు. 
views: 1584



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams