Current Affairs Telugu Daily

‘ఫ్రిల్డ్‌ షార్క్‌’ బతికే ఉన్నట్లు గుర్తింపు
అతిపురాతనమైన, డైనోసార్ల కాలంనాటి అరుదైన ‘ఫ్రిల్డ్‌ షార్క్‌’ నేటికీ బతికే ఉందని ఐరోపాకు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. ఇటీవల అట్లాంటిక్‌ మహాసముద్రంలో బాగా లోతుగా వెళ్లి పరిశోధనలు చేస్తున్న బృందానికి ఇది కనిపించింది. పామును పోలిన నోరు, 300 దంతాలను కలిగి ఉంది. సుమారు ఆరు అడుగుల వరకు ఇది పెరుగుతుంది. షార్క్‌ చేపను సైతం ఇది పొట్టన పెట్టుకోగలదు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ సముద్రజలాల్లో బాగా లోతు ఉన్న ప్రాంతాల్లో ఇది జీవిస్తున్నందు వల్ల మనుషులకు కనిపించే అవకాశం బాగా తక్కువ.
views: 3138

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams