Current Affairs Telugu Daily

పంకజ్‌ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ 
భారత స్టార్‌ క్రీడాకారుడు పంకజ్‌ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ (150 అప్‌ ఫార్మాట్‌) టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 2017 నవంబర్‌ 12న జరిగిన ఫైనల్లో పంకజ్‌ అద్వానీ తన చిరకాల ప్రత్యర్థి మైక్‌ రసెల్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించాడు. గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ పంకజ్‌ చాంపియన్‌గా నిలిచాడు. తాజా విజయంతో పంకజ్‌ తన ఖాతాలో 17వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గతంలో పంకజ్‌ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్‌ (150 అప్‌ ఫార్మాట్‌-2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను, ఏడుసార్లు  ప్రపంచ బిలియర్డ్స్‌ (టైమ్‌ ఫార్మాట్‌-2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను, రెండుసార్లు ప్రపంచ స్నూకర్‌ (2015, 2003) టైటిల్స్‌ను, రెండుసార్లు ప్రపంచ సిక్స్‌ రెడ్‌ స్నూకర్‌ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్‌ బిలియర్డ్స్‌ (2014) టైటిల్‌ను సాధించాడు.  
views: 3677

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams