అంతరిక్ష యాత్రకు వెళ్లిన ఏకైక పిల్లికి అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో దీని కాంస్య విగ్రహం ఫ్రాన్స్‌లో ఏర్పాటుకానుంది. 1963 అక్టోబరు 18న వెరోనిక్ ఏజీ1 రాకెట్‌ను ఫ్రాన్స్ ప్రయోగించింది. దీనిలోనే ఫెలిసెట్టె అంతరిక్ష యాత్రకు వెళ్లింది. 157 కి.మీ.ల ఎత్తులో ఇది భారరహిత స్థితికి గురైంది. అనంతరం ప్రత్యేక ప్యారాచూట్లో భూమిపైకి వచ్చేసింది. దీని తర్వాత అంతరిక్ష యాత్రకు వెళ్లిన శునకాలు, కోతులగౌరవార్థం ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఫెలిసెట్టెకు ఎలాంటి విగ్రహమూ లేకపోవడంపై కిక్‌స్టార్టర్ వెబ్సైట్లో బ్రిటన్‌కు చెందిన మాథ్యూ సెర్జె ప్రత్యేక ప్రచారం చేపట్టి నిధును సమీకరించారు. వీటితోనే ప్రస్తుతం ఫెలిసెట్టే విగ్రహం ఏర్పాటవుతోంది. వ్యోమగాములపై గురుత్వాకర్షణలేమి ప్రభావాన్ని గుర్తించేందుకు తొలినాళ్లలో పరిశోధకుల రాకెట్లలో జంతువులను పంపారు
views: 4259