Current Affairs Telugu Daily

విపత్తుల నిర్వహణకు ఫేస్‌బుక్‌ చేయూత
సహజ విపత్తుల సమయంలో బాధితులకు తక్షణ సహాయం చేరవేసేందుకు ఫేస్‌బుక్‌తో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ) చేతుల కలిపింది. విపత్తు చోటుచేసుకున్న సమయంలో ప్రత్యేకమైన ‘విపత్తు పటాల’ను రూపొందించేందుకు ఫేస్‌బుక్‌ ముందుకువచ్చింది. జనాలు ఉన్న స్థలం, వారి కదలికలు, క్షేమ సమాచారం గురించి వారు ఫేస్‌బుక్‌లో పెట్టిన అప్‌డేట్‌ ఆధారంగా వీటిని తయారుచేస్తారు. ఆ సమాచారం ఎన్‌డీఎమ్‌ఏ, ఇతర స్వచ్ఛంద సంస్థతో పంచుకుంటారు. ఫలితంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న విషయాలను సంస్థలు సులభంగా గుర్తించవచ్చు..
views: 5668



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams