Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్రకుమార్‌ సిన్హా రాజీనామా 
బంగ్లాదేశ్‌ మొట్టమొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్రకుమార్‌ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన అవినీతి, అక్రమ నగదు చలామణి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు విషయంలో ప్రభుత్వంతో వివాదం మొదయ్యాక సుమారు నెల రోజుల క్రితం ఆయన సెలవుపై విదేశం వెళ్లారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తు అభిశంసనలో పార్లమెంటు కున్న అధికారాన్ని రద్దు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఆ మేరకు 16వ రాజ్యాంగ సవరణను ఆయన కొట్టి వేశారు. జస్టిస్‌ సిన్హా  2018 జనవరి 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అబుల్‌ వాహబ్‌ మియాహ్ నియమితులయ్యారు.
views: 1302

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams