మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్యగౌడ్‌ మృతి
మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్యగౌడ్‌ మృతి
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు దేశిని చినమల్లయ్యగౌడ్‌(82) 2017 నవంబర్‌ 11న మృతి చెందారు. దేశిని స్వస్థలం కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి. ఇందుర్తి నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా 4 దఫాలు శాసనసభ్యుడిగా గెలుపొందారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చినమల్లయ్య నిజాంకు వ్యతిరేకం గానూ పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీపీఐ అధిష్టానం అంగీకరించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. 2001లో కేసీఆర్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో ఒకరిగా ఉన్నారు. 
views: 1685
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Latest Current affairs in Telugu, Latest Current affairs in English for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB and all other competitive exams.

© 2017   vyoma online services.  All rights reserved.