Current Affairs Telugu Daily

దళితులకు ఎయిర్‌ హోస్టెస్‌ శిక్షణ
వాయు రవాణా రంగంలో దళితులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ (నిథమ్‌) అందించే ఎయిర్‌హోస్టెస్‌ కోర్సులో వారిని చేర్చించనుంది. ఇందులో చేరేందుకు 200 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా తొలి బ్యాచ్‌ కింద వారిలో 50 మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ నిర్ణయించింది. దీని వ్యవధి 6 నెలలు. వారానికి 2 రోజులు శంషాబాద్‌ విమానాశ్రయంలో క్షేత్రస్థాయి శిక్షణ ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి 6 సంస్థల ద్వారా వివిధ ఉపాధి కోర్చుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందుకు రూ.168 కోట్ల మేర ఖర్చు చేయనుంది. కొత్తగా చేర్చిన దర్జీ కోర్సు కింద కనీసం 10 వేల మందికి కుట్ల, అల్లికలపై శిక్షణ ఇచ్చి ఆధునిక కుట్టమిషన్లు అందించాలని యోచిస్తోంది. అపోలో వైద్య సంస్థతోనూ కలిసి పలు కార్యక్రమాలను రూపొందించింది. 
NITHM-National Institute of Tourism and Hospitality Management

views: 1796

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams