డిల్లీకి భారీ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ కేంద్రం
ఎగ్జిబిషన్‌ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్‌, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూడిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ), నాన్‌-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. ఉన్నత విద్యా సంస్థ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే జాతీయ గ్రామీణ తాగు నీటి పథకం(ఎన్‌ఆర్‌డీడబ్యూపీ) పునర్వ్యవస్థీకరణకు 2017-18 నుంచి 2019-20 వరకూ రూ. 23,050 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది.
ECC-Exhibition-cum-Convention Centre

views: 1734
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams