Current Affairs Telugu Daily

లలిత్‌బాబుకు జాతీయ చెస్‌ టైటిల్‌ 
జాతీయ ప్రిమియర్‌ చెస్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను తెలుగుతేజం, గ్రాండ్‌మాస్టర్‌ ముసునూరి లలిత్‌బాబు గెలుచుకున్నాడు. లలిత్‌బాబు జాతీయ ప్రిమియర్‌ చెస్‌ టోర్నీ గెలవడం ఇదే ప్రథమం. 13 రౌండ్లు ఆడిన లలిత్‌.. 9 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. 2017 నవంబర్‌ 10న పాట్నాలో జరిగిన ఆఖరి రౌండ్లో స్వప్నిల్‌ దోపడేతో అతను గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆరు గేమ్‌లను గెలిచిన లలిత్‌.. ఆరు గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. ఒకే ఒక్క గేమ్‌లో ఓడిపోయాడు. అరవింద్‌ (8.5 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. 
views: 1422

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams