భారత్‌ నుంచే సల్పర్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు అత్యధికం
సల్పర్‌ డై ఆక్సైడ్‌ (ఎస్‌ఓ2) ఉద్గారాలు ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌ నుంచి వెలువడుతున్నాయని అమెరికాలోని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. 2007 తర్వాత భారత్‌లో ఎస్‌ఓ2 ఉద్గారాలు 50% పెరిగాయని.. అదే సమయంలో చైనాలో 75% తగ్గాయని పేర్కొంది. చైనా, భారత్‌ల్లో బొగ్గు వినియోగం అత్యధికంగా ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే 2000 నుంచి ఉద్గారాలను తగ్గించుకునేందుకు చైనా వివిధ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఎస్‌ఓ2 ఉద్గారాలు తగ్గినా.. చైనాలో గాలి నాణ్యత ఇంకా ప్రమాదకరంగానే ఉందని అధ్యయనం తెలిపింది. 2012లో భారత్‌లో అతిపెద్ద బొగ్గు ఆధారిత విద్యుత్‌ప్లాంటు ప్రారంభమైందని.. దేశంలో ఇంకా ఉద్గారాల నియంత్రణకు చర్యలు చేపట్టలేదని వెల్లడించింది. అయితే చైనాలో ఉన్నంతగా సమస్యలు భారత్‌లో లేవని, జన సమర్థ ప్రాంతాల్లో ప్లాంటు, పరిశ్రమలు లేకపోవడమే అందుకు కారణమని వివరించింది.
views: 816

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams