కృత్రిమ మూత్రపిండాలు అభివృద్ధి చేస్తున్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు
మూత్రపిండాల రుగ్మతలతో బాధపడుతున్నవారికి అసలైన కిడ్నీలా పనిచేసే ఒక కృత్రిమ అవయవాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది విజయవంతమైతే డయాలసిస్‌ అవసరం తప్పిపోతుంది. మూత్రపిండాల వ్యాధి ముదిరిపోయిన దశలో ఉన్న రోగులకు ఆ అవయవ మార్పిడే సరైన చికిత్స. అయితే అమెరికాలో ఏటా 25వేల మూత్రపిండాల మార్పిళ్లు జరుగుతుండగా.. ఇంకా లక్ష మందికిపైగా ఆ అవయవం కోసం ఎదురుచూస్తున్నారు. రోగులు తమకు సరిపోయే అవయవం కనీసం 5-10 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ లోపు ఈ వ్యాధిగ్రస్థులు డయాలసిస్‌ చేయించుకోవాలి. కిడ్నీలు నిర్వహించే రక్త శుద్ధి ప్రక్రియను ఈ యంత్రాలు నిర్వహిస్తాయి. అయితే ఇవి పూర్తిస్థాయిలో విషపదార్థలను తొలగించలేవు. డయాలసిస్‌ రోగుల సరాసరి ఆయుర్దాయం 5-10 ఏళ్లుగా ఉంది.
- డయాలిసస్‌కు విరుగుడుగా షువోరాయ్‌ నేతృత్వంలోని బృందం జీవకృత్రిమ మూత్రపిండాన్ని రూపొందించింది. దీన్ని శరీరంలోకి చొప్పించవచ్చు. ఇది శరీర సొంత రక్తపోటు సాయంతో పనిచేస్తుంది. శరీరం వేలుపలికి వచ్చే గొట్టాలు, ఇతర అనుసంధానాల అవసరం ఉండదు. ఇందులో అధునాతన సిలికాన్‌ నానో టెక్నాలజీని చొప్పించారు. అందువల్ల భారీ స్థాయిలో ఈ సాధనాలను ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. రక్తంతో కలసి పనిచేయడానికి వీలుగా ఈ సిలికాన్‌ పొరకు వినూత్న అణు పూతను పూశారు. మూత్రపిండాల మార్పిడి అనంతరం.. శరీర రోగ నిరోధక వ్యవస్థ నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఇమ్యూనోసప్రసెంట్‌ ఔషధాలను వాడాల్సిన అవసరం ఉండదు. ఈ సాధనంతో ఆ ఇబ్బంది తప్పుతుంది. వడకట్టడం, సమత్యౌం చేయడం సహా సహజసిద్ధ మూత్రపిండం నిర్వహించే అన్ని రకా విధును ఇది నిర్వర్తిస్తుంది. దీన్ని త్వరలో మానవులపై ప్రయోగించనున్నారు.
- తొలుత ఈ సాధనంలోని హీమోఫ్టిర్‌ మాడ్యూల్‌లోకి రక్తం ప్రవేశిస్తుంది. అక్కడ తొలి శుద్ధి జరుగుతుంది. ఈ క్రమంలో నీరులా ఉండే అల్ట్రాఫ్టిరేట్‌ ఏర్పడుతుంది. ఇందులో కరిగిన విషతుల్య రసాయనాలు, చక్కెరలు, లవణాలు ఉంటాయి. 
- ఆ తర్వాత మూత్రపిండాల కణాలతో కూడిన ఒక బయోరియాక్టర్‌.. ఈ అల్ట్రాఫ్టిరేట్‌ను శుద్ధి చేస్తుంది. చక్కెరలు, లవణాలను తిరిగి రక్తంలోకి పంపేస్తుంది. ఈ క్రమంలో నీటిని శరీరం తిరిగి గ్రహించేస్తుంది. అల్ట్రాఫ్టిరేట్‌ను మూత్రంగా మార్చేస్తుంది. దాన్ని శరీరం నుంచి వేలుపలికి పంపడం కోసం మూత్రాశయంలోకి చేరవేస్తుంది.

views: 706
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams